![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.
మరుసటి రోజు శ్రీమంతంకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాజ్, కళ్యాణ్ ఇద్దరు కలిసి అప్పు, కావ్యలకి బంగారం గాజులు తీసుకొని వస్తారు. అవి చూసి అపర్ణ, ధాన్యాలక్ష్మి బాగున్నాయని చెప్తారు. కనకం మాత్రం శ్రీమంతం కోసం మట్టి గాజులు వాడాలి. లోపల బిడ్డకి మంచిది అని చెప్పగానే సరే తెప్పిస్తానని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి జుట్టుకి సామ్రాణి పడుతాడు. ఆ తర్వాత అప్పు దగ్గరికి కళ్యాణ్ వెళ్లి రెడీ చెయ్యాలా అని అడుగుతాడు. అప్పుడే ధాన్యాలక్ష్మి వచ్చి నువ్వేం అవసరం లేదు. నేను రెడీ చేస్తానని ధాన్యాలక్ష్మి అంటుంది. ధాన్యాలక్ష్మి తనపై చూపించే ప్రేమకి అప్పు ఎమోషనల్ అవుతుంది.
ఆ తర్వాత రేఖ, రుద్రాణి కలిసి కావ్య తాగే దాంట్లో పసరు మందు కలపాలని ట్రై చేస్తారు. కావ్య దగ్గరకి కనకం వచ్చి ఎంత అందంగా ఉన్నావే అని కూతురిని చూసి మురిసిపోతుంది. తరువాయి భాగంలో కావ్య, అప్పులకి శ్రీమంతం జరుగుతుంటే రుద్రాణి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే వద్దని కనకం అపుతుంది. ఈ రుద్రాణి కావ్య కడుపులో బిడ్డని చంపాలని అనుకుందని పసరు మందు ఇచ్చిన అతన్ని కనకం తీసుకొని వస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |